Header Banner

సౌదీలో అద్భుతం..! మనుషులకు బదులు ఏఐ డాక్టర్లతో వైద్యం!

  Sun May 18, 2025 13:18        U A E

వైద్య రంగంలో సాంకేతికత మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రోగులను పరీక్షించి, వారికి చికిత్స అందించే క్లినిక్ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. ఈ వినూత్న ప్రయోగానికి చైనాకు చెందిన వైద్య సాంకేతిక సంస్థ 'సినాయ్ ఏఐ', సౌదీ అరేబియాలోని 'అల్మూసా హెల్త్ గ్రూప్'తో చేతులు కలిపింది. లీడర్స్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఈ ట్రయల్ కార్యక్రమం గత నెలలో సౌదీ తూర్పు ప్రావిన్స్‌లోని అల్-అహ్సాలో మొదలైంది.

రోగులకు ప్రాథమికంగా రోగ నిర్ధారణ చేసి, చికిత్స అందించే విషయంలో మానవ వైద్యుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేయడమే దీని లక్ష్యం. అయితే, ఈ వ్యవస్థలో మానవ వైద్యులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. వారు ‘భద్రతా పర్యవేక్షకులు’ (సేఫ్టీ గేట్‌కీపర్లు)గా వ్యవహరిస్తూ ఏఐ అందించిన సమాచారాన్ని, చికిత్సా విధానాన్ని సమీక్షిస్తారు. ‘ఏఐ క్లినిక్ అనేది ఒక వినూత్న వైద్య సేవా వ్యవస్థ. ఇక్కడ ఏఐ వైద్యులు రోగిని విచారించడం నుంచి మందులు సూచించడం వరకు పూర్తి వైద్య కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్వహిస్తారు. మానవ వైద్యులు రోగ నిర్ధారణ, చికిత్స ఫలితాలను సమీక్షిస్తారు’ అని షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న సినాయ్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏఐ క్లినిక్ ఎలా పనిచేస్తుంది?
క్లినిక్‌కు వచ్చిన రోగులు ట్యాబ్లెట్ కంప్యూటర్ ద్వారా ‘డాక్టర్ హువా’ అనే ఏఐ డాక్టర్‌కు తమ ఆరోగ్య సమస్యలు, లక్షణాలను వివరిస్తారు. అచ్చం నిజమైన డాక్టర్ లాగే ఈ ఏఐ డాక్టర్ కూడా మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. మానవ సహాయకుల సాయంతో తీసుకున్న డేటా, చిత్రాలను విశ్లేషిస్తుంది. ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్టర్ హువా ఒక చికిత్సా ప్రణాళికను అందిస్తుంది. దీనిని మానవ వైద్యుడు క్షుణ్ణంగా సమీక్షించిన అనంతరం ఆమోదిస్తారు. ఏఐ నిర్వహించలేని అత్యవసర పరిస్థితుల్లో మానవ వైద్యులు అందుబాటులో ఉంటారు.

ప్రస్తుతానికి, ఈ ఏఐ డాక్టర్ కేవలం శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలకు మాత్రమే సలహాలు, చికిత్స అందిస్తోంది. ఇందులో ఆస్తమా, ఫారింజైటిస్ వంటి దాదాపు 30 రకాల వ్యాధులు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఏఐ డాక్టర్ డేటాబేస్‌ను 50 రకాల శ్వాసకోశ, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు విస్తరించాలని సినాయ్ ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా సేకరించిన రోగ నిర్ధారణ డేటాను సౌదీ అధికారులకు సమర్పించనున్నారు. దీనికి సుమారు 18 నెలల్లో ఆమోదం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత ట్రయల్‌కు ముందు నిర్వహించిన పరీక్షా దశలో, ఈ సాంకేతికతలో కేవలం 0.3 శాతం మాత్రమే తప్పులు దొర్లినట్టు సినాయ్ ఏఐ పేర్కొంది.

సినాయ్ ఏఐ సీఈవో జాంగ్ షావోడియన్ మాట్లాడుతూ.. ‘గతంలో ఏఐ కేవలం వైద్యులకు సహాయకారిగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు, రోగులను నేరుగా నిర్ధారించి, వారికి చికిత్స అందించే దిశగా మేం తుది అడుగు వేస్తున్నాం’ అని తెలిపారు. టెన్సెంట్, హోంగ్‌షాన్ క్యాపిటల్, జీజీవీ క్యాపిటల్, స్థానిక ప్రభుత్వం వంటి సంస్థల మద్దతు ఉన్న ఈ కంపెనీ, తమ ఏఐ నమూనాల కోసం స్థానికీకరించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంఎస్)ను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. వీటిని ప్రాంతీయ వైద్య పరిభాష, స్థానిక భాషలు, సాంస్కృతిక విశేషాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు.


ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #SaudiArabia #AIDoctors #MedicalInnovation #HealthTech #ArtificialIntelligence #FutureOfHealthcare